Share News

ఊట్కూర్‌ను సస్యశ్యామలం చేస్తాం

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:57 PM

నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఊట్కూర్‌ మండలాన్ని సస్యశామలం చేస్తామని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఊట్కూర్‌ను సస్యశ్యామలం చేస్తాం

- 69 జీవో అమలుపై సీఎం సానుకూలం

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఊట్కూర్‌, జనవరి 30 : నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఊట్కూర్‌ మండలాన్ని సస్యశామలం చేస్తామని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, వల్లంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు ఊట్కూర్‌లో మటన్‌ మార్కెట్‌ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. 69 జీవోను అమలు చేసి, ఎత్తిపోతల ద్వారా నీరు అందడానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి మాట్లాడినట్లు తెలిపారు. వారు 69 జీవో అమలుపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అది సాధ్యం కాకపోతే సంగంబండ బ్యాక్‌ వాటర్‌ను ఊట్కూర్‌తో పాటు మండలంలోని ఇతర గ్రామాల చెరువులను నింపి జాయమ్మ చెరువును కూడా నింపేలా చేయాలని రెండు ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. ఈ ఎత్తిపోతల పథకం అమలైతే ఊట్కూర్‌ మండలంతో పాటు మక్తల్‌ మండలంలోని జక్లేర్‌, కాచ్‌వార్‌, గుడిగండ్ల పరిసర గ్రామాలకు నీరు అందుతోందన్నారు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దాం అన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌కుమార్‌గౌడ్‌, ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో ఊట్కూర్‌, నాగిరెడ్డిపల్లి, వల్లంపల్లి, పులిమామిడి సర్పంచులు సూర్యప్రకాష్‌రెడ్డి, స్వాతి గోవిందుగౌడ్‌, ఎడవెల్లి నర్సప్ప, కొత్తపల్లి శాంతమ్మ, పెద్దసూరయ్యగౌడ్‌, బిజ్వార్‌, పగిడిమారి, ఊట్కూర్‌ ఎంపీటీసీ సభ్యులు హన్మమ్మ, షహెనాజ్‌బేగం, హన్మంతు, ఊట్కూర్‌ ఉప సర్పంచ్‌ ఇబిదూర్‌ రహెమాన్‌, ఓబ్లపూర్‌ ఉప సర్పంచ్‌ వెంకటేష్‌గౌడ్‌, మండల నాయకులు సత్యనారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లింగం, నాయకులు మోహన్‌రెడ్డి, కొక్కు శంకర్‌, అశోక్‌, ఖాజా, జలాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:57 PM