Share News

మక్తల్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తాం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:18 PM

మక్తల్‌ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

మక్తల్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తాం
డిగ్రీ కళాశాల ప్రారంభం అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మక్తల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం

మక్తల్‌, ఫిబ్రవరి 20 : మక్తల్‌ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌ పట్టణంలోని మినీ స్టేడియంను తత్కాలికంగా డిగ్రీ కళాశాలకు కేటాయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్‌ నియోజకవర్గ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చు అన్నారు. ఎమ్మెల్యే నిధుల్లో 30 శాతం విద్యాభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్యను అందించి గొప్ప ప్రయోజకులను చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో ఐదెరాల్లో డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మించి అన్ని హంగులతో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు కట్ట సురేష్‌కుమార్‌ గుప్త, రాజప్ప గౌడ్‌, మందుల నరేందర్‌, కున్సి నాగేందర్‌, కావలి ఆంజనేయులు, నర్సింహా మూర్తి, కట్ట వెంకటేష్‌, నూరుద్దీన్‌, అబ్దుల్‌ రహెమాన్‌, ఫయాజ్‌, నాగేష్‌, వాకిటి శ్మామ్‌, చందాపూర్‌ వెంట్రాములు, కల్లూరి గోవర్దన్‌, గుంతలి రవి, నర్సింహా పాల్గొన్నారు.

చేతి వృత్తుల వారికి సహకరిస్తా..

చేతి వృత్తుల వారికి చేతనైనంత సహాయం అందించి సహాకరిస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏఆర్‌ఎం మినీ ఫంక్షన్‌ హాల్‌లో చేతి వృత్తుల అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ ఆచార్య ఆధ్వర్యంలో మక్తల్‌ మండల వడ్రంగి చేతి వృత్తుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ చేతి వృత్తుల వారి కష్టాలు చూస్తున్నానన్నారు. చాలీ చాలని లాభాలతో కుటుంబ పోషణ సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్నా చేతి వృత్తుల వారికి కేటాయిస్తామన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి చేతి వృత్తుల వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో చేతి వృత్తుల సంఘం గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస చారీ, ప్రధాన కార్యదర్శి ఉజ్జెల్లి మోనేషా చారీ, కోశాధికారి బాల్‌రాజ్‌, వెంకటేష్‌, సర్పరాజ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు ధ్రువ పత్రాల అందజేత

మినీ అంగన్‌వాడీలను సాధారణ అంగన్‌ వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేసిన ఉత్తర్వులను మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సబిత, వెంకటమ్మ, రుక్మిణి, కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, కట్ట సురేష్‌, విష్ణువర్ధన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:18 PM