పీజేపీ క్యాంపులో స్థలం ఇచ్చేదాకా పోరాడుతాం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:46 PM
జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంపులో కోర్టు సముదాయం నిర్మాణానికి స్ధలం ఇచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘురామిరెడ్డి అన్నారు.
గద్వాల క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంపులో కోర్టు సముదాయం నిర్మాణానికి స్ధలం ఇచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘురామిరెడ్డి అన్నారు. సోమవారం జి ల్లా కేంద్రంలోని కోర్టు ఎదురుగా న్యాయవాదు లు చేస్తున్న నిరసన దీక్షలు 13వ రోజకు చేరుకున్నాయి. ఈ శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కక్షిదారు లు, ప్రజల కోసమే న్యాయవాదులు పోరాటం చే స్తున్నారని, ఇందులో స్వార్థం లేదన్నారు. అ యి తే కొందరు న్యాయవాదులు సోషల్ మీడియా లో, పత్రికల్లో గద్వాల మండలంలోని అనం తపురం గుట్టల స్ధలాన్ని అంగీకరించి న్యాయమూర్తుల సమక్షంలో స్ధలపరిశీలన చేసినట్లు తప్పు డు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు నమ్మరాదని చెప్పారు. గతం లో ప్రజల సొమ్ముతో నీటి పారుదల శాఖ కోసం 60.13 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించారని అందులో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పోగా 11.30 ఎకరాల స్ధలం ఉందన్నారు. ఈ భూమిని ఇవ్వాలని కోరినా కలెక్టర్ తాత్సారం చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. గుట్టలో కా కుండా వేరే ఎక్కడ కోర్టు సముదాయాన్ని చేపట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. సమావేశంలో సభ్యులు, న్యాయవాదులు ఉన్నారు.