Share News

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:22 PM

గ్రామాల ఆభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పంచాయతీ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి

- ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌, జనవరి 29: గ్రామాల ఆభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని బుసిడిరెడ్డిపల్లిలో సోమవారం రాత్రి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పేరుతో నాయకులు రాష్ర్టాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సింధూజ, మాజీ ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు గోవర్ధన్‌సాగర్‌, రాముయాదవ్‌ ఉన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:22 PM