Share News

జల సంరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:02 PM

భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత అని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వనపర్తి జిల్లా హైడ్రోజియాలజిస్ట్‌ డాక్టర్‌ యుగంధర్‌రెడ్డి తెలిపారు.

జల సంరక్షణ అందరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ పీ యుగంధర్‌ రెడ్డి

వనపర్తి రూరల్‌, మార్చి 22: భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత అని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వనపర్తి జిల్లా హైడ్రోజియాలజిస్ట్‌ డాక్టర్‌ యుగంధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా మహిళా డిగ్రీ కళాశాల, బోటనీ శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలం, నిర్వహణ అనే అంశంపై ప్రత్యేక కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జల పరిరక్షణ ప్రజలందరి తక్షణ కర్తవ్యం అని తెలిపారు. నీటి పొదుపు, సంరక్షణ, నీటి లెక్కింపు, ఇంకుడు గుంతల ఏర్పాటు, ఆరుతడి పంటల సాగు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ వెంటక ప్రసాద్‌, గోవర్ధన్‌, స్వాతి, ఆంజనేయులు, శివ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:02 PM