Share News

అన్ని పేపర్లు ఉంటేనే వాహనాలు కొనాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:51 PM

ప్రజలు వాహనాలు కొనుగోలు, విక్రయించేటప్పుడు వాహనాలకు సంబంధించిన ఆర్‌సీ, లైసెన్స్‌, టాక్స్‌, బీమాకు సంబంధించిన పేపర్లు తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు అన్నారు.

అన్ని పేపర్లు ఉంటేనే వాహనాలు కొనాలి
కార్డెన్‌ సెర్చ్‌లో మాట్లాడుతున్న డీఎస్పీ

గోపాల్‌పేట, ఏప్రిల్‌ 12: ప్రజలు వాహనాలు కొనుగోలు, విక్రయించేటప్పుడు వాహనాలకు సంబంధించిన ఆర్‌సీ, లైసెన్స్‌, టాక్స్‌, బీమాకు సంబంధించిన పేపర్లు తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ వెంకటేశ్వర రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీఐ నాగభూషణరావు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హనుమాన్ల గడ్డలో సరైన పత్రాలు లేని వాహన యజమానులకు అవగాహన కల్పించారు. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వాటి పత్రాలు తప్పనిసరిగా ఉంటేనే కొనుగోలు చేయాలని, చోరీకి గురైన వాహనాలను నకిలీ ఆర్‌ిసీలు పెట్టి అమ్ముతుంటారని తెలిపారు. అటువంటి సమయంలో ఆర్‌టీవో ఆఫీస్‌లో చెక్‌ చేసుకుని వాహనాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొన్నిసార్లు వాహనం మీద ఉన్న కేసులు తీసుకున్న వాహనదారునిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో టూ వీలర్‌కు హెల్మెట్‌, ఫోర్‌ వీలర్‌కి సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హరిప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:51 PM