Share News

వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:51 PM

డ్రైవింగ్‌ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంటీవో ఆర్‌ఎస్‌ఐ శివశంకర్‌ పోలీస్‌ మోటార్‌ వాహన డ్రైవర్లకు సూచించారు.

వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
పోలీస్‌ మోటార్‌ వాహన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్న ఎంటీవో ఎస్‌ఐ శివశంకర్‌

నారాయణపేట, ఫిబ్రవరి 13 : డ్రైవింగ్‌ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంటీవో ఆర్‌ఎస్‌ఐ శివశంకర్‌ పోలీస్‌ మోటార్‌ వాహన డ్రైవర్లకు సూచించారు. మంగళవారం ఎస్సీ కార్యాలయంలోని శిక్షణ కేంద్రంలో డ్రైవర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ విధులు నిర్వర్థించే డ్రైవర్లు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. వాహనానికి జీపీఎస్‌ కనెక్ట్‌ చేయడం జరిగిందని, రాత్రి పెట్రోలింగ్‌ చేసే సమయంలో తమకు కేటాయించిన పీఎస్‌ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సైరన్‌ వేసుకుంటూ పెట్రోలింగ్‌ నిర్వహించాలని, వాహనాన్ని ఆపరాదని కంప్యూటర్‌ ఆధారంగా వాహనాల పెట్రోలింగ్‌ రూట్‌ను చెక్‌ చేస్తామన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. వాహనాల మెకానిజంపై అవగాహన కలిగి ఉండాలని, వాహనాలను కండిషనల్‌లో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్‌ మోటార్‌ వాహన డ్రైవర్లు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:51 PM