Share News

అండర్‌-19 వాలీబాల్‌ జాతీయ స్థాయి పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:45 PM

అండర్‌- 19 వాలీబాల్‌ జాతీయస్థాయి క్రీడలు ప్రారంభ మయ్యాయి. ఆదివారం కాంగ్రెస్‌ కొడంగల్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి 68వ పాఠశా ల క్రీడాసమాఖ్య అండర్‌-19 బాలుర విభాగంలో జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభిం చారు.

 అండర్‌-19 వాలీబాల్‌ జాతీయ స్థాయి పోటీలు ప్రారంభం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌

- క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచాటి గుర్తింపు తేవాలి

- కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి

కోస్గి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అండర్‌- 19 వాలీబాల్‌ జాతీయస్థాయి క్రీడలు ప్రారంభ మయ్యాయి. ఆదివారం కాంగ్రెస్‌ కొడంగల్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి 68వ పాఠశా ల క్రీడాసమాఖ్య అండర్‌-19 బాలుర విభాగంలో జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు దేశానికి, తెలంగాణ రాష్టానికి మంచి పేరు తీసుకురావాల ని కోరారు. ఈ పోటీలు స్థానిక ప్రభుత్వ కళాశా ల మైదానంలో ప్రారంభం కా గా, ఇందులో 21 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాం తాలు, ఏడు కేంద్ర పాఠశాల ల జట్లనుంచి దాదాపుగా 400 మంది క్రీడాకారులు, 100మంది జట్ల కోచ్‌ మేనేజ ర్లు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా క్రీడాకారులను ఉద్దే శించి ఆయన మాట్లాడుతూ ప్రతీ రాష్ట్రం నుంచి ఈ క్రీడలలో క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి క్రీడలపై ప్రత్యేకశ్రద్ధ చూపుతు న్నారని, అందులో భాగంగానే ఈక్రీడలు కోస్గిలో నిర్వహిస్తున్నారని అన్నారు. మొదట హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ క్రీడను ప్రారంభించారు. ఎస్జీఎఫ్‌ రాష్ట కార్యదర్శి రామ్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ గరీమానరుల, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ వార్ల వి జయ్‌కుమార్‌, డీఈవో గోవిందరాజులు, తహసీ ల్దార్‌ మల్లిఖార్జునరావ్‌, ఎంపీడీవో శ్రీధర్‌, కమిష నర్‌ నాగరాజు, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:45 PM