Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నిండు జీవితానికి రెండు చుక్కలు

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:09 PM

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి అన్నారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు
పేటలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి

- పేట ఎంపీడీవో కార్యాలయంలో పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభం

నారాయణపేట, మార్చి 3 : నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని పేట ఎంపీడీవో కార్యాలయంలో డాక్టర్‌ శైలజతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పోలియో మహమ్మారిపై చిన్నారుల తల్లిదండ్రులకు వివరించారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించి విజయం సాధించాలన్నారు. అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించి, చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుదా మన్నారు. నేడు, రేపు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తప్పిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు అందిస్తారని అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు వినయ్‌ సింగ్‌ పాల్గొని జిల్లాలో కొ నసాగుతున్న చుక్కల మందును పరిశీలించారు. నారాయణపేట మండలం సింగారం పల్లె దవాఖానాలో ఐదేళ్లలోపు చిన్నారులకు జడ్పీ సీఈవో శైలజ, వైద్య సిబ్బంది నవనీత, మంజూర్‌ అహ్మద్‌, కార్యదర్శి నాగి రెడ్డి చుక్కల మందు పంపిణీ చేశారు. వైద్యులు నరసింహా, గోవిందరాజు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:09 PM