Share News

కార్యకర్త మృతికి కూనంనేని నివాళులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:28 PM

జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌ పట్టణానికి చెందిన సీపీఐ కార్యకర్త రాజ్‌కుమార్‌ మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు.

కార్యకర్త మృతికి కూనంనేని నివాళులు
నివాళులు అర్పిస్తున్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని, జాతీయ నాయకుడు నారాయణ

వడ్డేపల్లి, జనవరి 12: జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌ పట్టణానికి చెందిన సీపీఐ కార్యకర్త రాజ్‌కుమార్‌ మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని శుక్రవారం శాంతినగర్‌కు వచ్చి, కార్యకర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మంచి కార్యకర్తను కోల్పోయామని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ జాతీయ నాయకుడు నారాయణ నివాళులు అర్పించి, కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు పూర్ణచందర్‌రావు, రాంబాబు, సుబ్బారావు, చిన్నిబాబు, గోవిందు, ఆంజనేయులు, ఆశన్న ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:28 PM