Share News

వెంకటస్వామికి నివాళి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:30 PM

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత జి వెంకటస్వామి (కాకా) వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం జోగులాంబ గద్వాల డీఐజీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళిర్పించారు.

వెంకటస్వామికి నివాళి
వెంకటస్వామి చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న పోలీస్‌ అధికారులు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) :మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత జి వెంకటస్వామి (కాకా) వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం జోగులాంబ గద్వాల డీఐజీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళిర్పించారు. ఈ సందర్భంగా అడిషినల్‌ ఎస్పీ రాములు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వెంకటస్వామి తన జీవితకాలం ప్రజాసేవకు అంకితమై పనిచేశారన్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌, ఎంటిఆర్‌ఐ నగశ్‌ పాల్గొన్నారు.

మునిసిపల్‌ కార్యాలయంలో...

మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి వెంకటస్వామి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఎంపీగా, కేంద్రమంత్రిగా కార్మిక సమస్యలపై పోరాడి వారి సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆర్డీవో నవీన్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ, కలెక్టరేట్‌ ఏవో శంకర్‌, డీపీఆర్వో శ్రీనివాసులు, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డీటీ దేవేందర్‌ పాల్గొన్నారు.

భూత్పూర్‌ : కేంద్ర మాజీ మంత్రి వెంకట్‌స్వామి వర్ధంతి సందర్భంగా ఆదివారం తహసీల్దార్‌ రహమాన్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆర్‌ఐలు వెంకటేష్‌, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

రాజాపూర్‌ : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ఆవరణలో ఎంపీడీవో మచ్చేందర్‌ కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలల వేసి నివాళి అర్పించారు. నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నసీర్‌బాగ్‌, విక్రమ్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:30 PM