కర్నెతండా లిఫ్టుతో గిరిజనుల పురోగతి
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:55 PM
కర్నెతండా లిఫ్టుతో ఎత్త యిన ప్రాంతాలకు సాగునీటిని అందించి గిరిజనుల పురోగతికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

- 85 శాతం పనులు పూర్తి
- సబ్ స్టేషన్ మంజూరుకు కృషి
- విద్యా వ్యవస్థపై సీఎం ప్రత్యేక దృష్టి
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
ఖిల్లాఘణపురం, జూలై 8: కర్నెతండా లిఫ్టుతో ఎత్త యిన ప్రాంతాలకు సాగునీటిని అందించి గిరిజనుల పురోగతికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. మండలంలోని కర్నెతండా లిఫ్టు, దొంతికుంట తండా ఆదర్శ పాఠ శాల, మండల కేంద్రంలోని కస్తూర్బా ఇంగ్లిష్, తెలు గు మీడియం పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సోమవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కర్నెతండా లిఫ్టు పనులను గత ప్రభుత్వ హాయాంలో 85 శాతం పనులు పూర్తి కావడంతో పా టు మోటార్లను సైతం బిగించారని అన్నారు. బిజినే పల్లి మండలం మంగనూరు ఎడమ కాలువ ద్వారా ఘణపురం బ్రాంచ్ కెనాల్ మధ్యలో కర్నెతండా లిఫ్టు కు ప్రత్యేకంగా కాలువ ద్వారా నీటిని అందించి సాగు నీటిని ఎత్తిపోయడం జరుగుతుందని తెలిపారు. కర్నెతండా లిఫ్టు ద్వారా ఎత్తైన ప్రాంతంలోని 4,230 ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుందని తెలిపా రు. ఘణపురం మండలంలోని కర్నెతండా, షాపూర్, మామిడిమాడ, రుక్కన్నపల్లి, బిజినేపల్లి మండలం లోని లట్టుపల్లి, పెద్దమందడి మండలంలోని పామి రెడ్డిపల్లి, జంగమాయపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు సాగునీటి రాకతో ప్రజలు సిరిసంపదల తో సంతోషంగా ఉంటారని అన్నారు. మిగిలిపోయిన లిఫ్టు పనులను రెండు నెలల్లో పూర్తి చేసి గిరిజన రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తామని అన్నారు. లిఫ్టు కు సంబంధించి కాలువల నిర్మాణం అటవీ శాఖ పరిధిలో ఉండడంతో అనుమతులు ఆలస్యం అవుతు న్నట్లు తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన సమావే శంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతి బదిలీలు పారదర్శకంగా చేసినట్లు వివరించారు. యూనివర్సిటీ లలో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయి విద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతీ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థుల చేత పుస్తకాలు చది విస్తే పరిజ్ఞానం పెంపొందుతుందని అన్నారు. మండ ల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాలను మినీ స్టేడియాన్ని ఏర్పాటుకు సహకారం అందిస్తానని అన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజాయి రమేష్, డాక్టర్ నరేందర్ గౌడ్, విజయ లక్ష్మి, జయకర్, దేవుజా లింగస్వామి ఉన్నారు.