Share News

ప్రయాణ కష్టాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:12 PM

వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రం లోని రైల్వేగేటు వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లేక ప్ర యాణికులు నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు.

 ప్రయాణ కష్టాలు
రైల్వే గేటు తెరిచినప్పుడు ఎదురెదురుగా వస్తున్న వాహనాలు

- మదనాపురం రైల్వే గేటు వద్ద అవస్థలు

- ఆర్వోబీ నిర్మించాలంటున్న ప్రయాణికులు

మదనాపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రం లోని రైల్వేగేటు వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లేక ప్ర యాణికులు నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైల్వేగేటు ఆత్మకూర్‌, వనపర్తి, ప్రధాన రహదారి మీదనే ఉండటం వలన ప్రతీ రోజు వాహన రద్దీ ఉంటుంది. ఆర్వోబీ లేకపోవడంతో రైలు వచ్చి నప్పుడల్లా గేటు వేస్తున్నారు. గేటు తెరవడానికి 20 నిమిషాలు ఒక్కో సారి రైలు క్రాసింగ్‌ ఉన్నప్పుడు అ రగంట కూడా పడుతుంది. దీంతో వాహనాలు అధిక సంఖ్యలో ఆగు తున్నాయి. రైల్వేగేటు తెరిచినప్పు డు తొందరగా పొవాలన్న ఉద్దేశం తో వాహనాలను వేగంగా నడిపిన ప్పుడు ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఒక్కోసారి ఈ ట్రా ఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకుపో యి రోగులను సకాలంలో ఆసుప త్రికి తీసుకెళ్లలేక పోతున్నాయి. ఇ ప్పటికే సికింద్రాబాద్‌ నుం చి మహబూబ్‌నగర్‌ వరకు రైల్వే డబుల్‌ లైన్‌ పనులు పూర్తయ్యాయి. మహ బూబ్‌నగర్‌ నుంచి డోన్‌ వరకు పనులను మొద లు పెట్టారు. ఇక పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య మరింత పెరగడం వలన ప్రయాణికులకు చాలా ఆటంకాలు ఏర్పడుతాయి. ఎన్నికలు వచ్చినప్పు డు ప్రతీసారి నాయకులు ఆర్వోబీ నిర్మిస్తామని చెప్పి గెలిచిన తరువాత మరవడం అలవాటుగా మారింది. మండలంలోని కొన్నూరు, నెల్విడి ద గ్గర అండర్‌పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. రా మన్‌పాడు దగ్గర ఈ మధ్యనే పనులు ప్రారం భించారు. అక్కడ రైల్వే లై న్‌ ఎత్తు ఉం డడం వలన అండర్‌పాస్‌ చేయడాని కి వీలు పడింది. మదనాపు రం దగ్గర ఉన్న రైల్వే లైన్‌ కిందికి ఉండటంతో కచ్చితంగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించాలని రైల్వే అధికారులు అంచనా వేశారు. పనులు ఎప్పుడు మొదలు పెడుతారో మా క ష్టాలు ఎప్పుడు తీరుతాయో నని ప్రయాణికులు వేచి చూ స్తున్నారు.

ఉద్యోగులకు మరింత కష్టం

ఉద్యోగస్తులు డ్యూటీలకు వెళ్లినప్పుడు రైల్వే గేటు పడడం వలన ఆఫీసులకు వెళ్లడానికి ఆలస్యమవు తుంది. దీని వలన అనుకున్న సమయం కంటే గంట ముందుగా బయలు దేరుతున్నాం. అలాగే స్కూలు బస్సులు కూడా ఆలస్యమై విద్యార్థులు పాఠశాలలకు లేటుగా వెళ్తున్నారు.

- దేనా టీచర్‌, నర్సింగాపురం

Updated Date - Dec 28 , 2024 | 11:12 PM