Share News

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:04 PM

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎస్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూనిస్‌ పాషా అన్నారు.

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ యూనిస్‌ పాషా

- ఎస్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూనిస్‌ పాషా

గద్వాల టౌన్‌, జూన్‌ 10 : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎస్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూనిస్‌ పాషా అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యా య బదిలీలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయ డాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 317తో ఎదురైన సమస్యను పరిష్క రించాలని, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమిం చాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, ప్రభుత్వ బడులకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, పీఆర్‌సీ నివేదికను సత్వరం అమ లు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్‌, మెడికల్‌ బిల్స్‌, పీఆర్‌సీ ఏరియర్లను వెంటనే ఇవ్వాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో ప్రవేశాలకు ఎలాంటి పోటీ పరీక్ష నిర్వహించొద్దని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. 2017 డీఎస్సీ ఉపాధ్యాయులకు గత పీఆర్‌సీలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిపాటి లక్ష్మణ్‌, రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవులు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్‌ గౌరీ శంకర్‌, మండల బాధ్యులు, నాయకులు శ్రీహరి, కిషోర్‌ చంద్ర, కృష్ణయ్య, జయరాజు, విజయ భాస్కర్‌, శంకర్‌ నాయక్‌, రాజన్న, నయూమ్‌, వెంకటేశ్వర్లు, మహబూబ్‌, అనిరుధ్‌, భీమన్న, చక్రధర్‌, బీసన్న, సురేందర్‌ రావు, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:04 PM