నేడు మద్దూర్‌కు సీఎం
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:35 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మద్దూర్‌కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ దశదినకర్మకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ యోగే్‌షగౌతమ్ హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

కోస్గి/మద్దూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మద్దూర్‌కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ దశదినకర్మకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ యోగే్‌షగౌతమ్ హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సీఎం కాన్వాయ్‌కు సెక్యురిటీపై సిబ్బందితో చర్చించారు.
భద్రతా బృందాలతో సమావేశం
సీఎం పర్యటన సందర్భంగా మద్దూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివిధ భద్రతా బృందాలతో ఎస్పీ యోగే్‌షగౌతమ్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 350 మంది భద్రతా సిబ్బందితో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం ఉదయం 11:30 గంటలకు మద్దూర్‌కు చేరుకుంటారని చెప్పారు. 30 నిమిషాలు ఉండి, 12 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారని చెప్పారు.