పూర్వ వైభవం దిశగా పాటుపడాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:33 PM
పాలెం సుబ్బయ్య ఆరు దశాబ్దాల క్రితమే విద్యా సంస్థలను స్థాపించి లక్షలాది పేద విద్యార్థులకు ఉచితంగా అక్షర జ్ఞానం కల్గించిన విద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, క్యాదర్శులు బుడ్డ య్య, మోహన్‌బాబులు కోరారు.

బిజినేపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాలెం సుబ్బయ్య ఆరు దశాబ్దాల క్రితమే విద్యా సంస్థలను స్థాపించి లక్షలాది పేద విద్యార్థులకు ఉచితంగా అక్షర జ్ఞానం కల్గించిన విద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, క్యాదర్శులు బుడ్డ య్య, మోహన్‌బాబులు కోరారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య భవనంలో ఆదివారం పాలెం విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం 36వ వార్షిక సమావేశం నిర్వహించి, సుబ్బయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలలో విద్యా వలంటీర్లను నియమించి విద్యార్థులకు బోధన సాగించేందుకు పూర్వ విద్యార్థులు సహకారం అందిస్తున్నారని అన్నారు. డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులు సాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పూర్వపు అధ్యాపకులు రంగాచార్యులు, జగన్నాథ్‌రెడ్డి, హరేంద్రబాబు, డీఎస్పీ దేవేందర్, పాలెం డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పద్మ, కనకరాజులను పాలెం పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. సభ నిర్వాహకులు అనుపటి మల్లికార్జున్, అనుపటి లక్ష్మీకాంత్, వంగ ఆంజనేయులు గౌడ్, కృష్ణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బానురి నాగరాజు, సుదర్శన్ రెడ్డి, ప్రకాశ్ ఉన్నారు.