Share News

సాగుకు సమాయత్తం

ABN , Publish Date - May 29 , 2024 | 10:54 PM

జిల్లా వ్యాప్తంగా రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు.

సాగుకు సమాయత్తం
పేట శివారులోని పొలంలో ముళ్ల పొదలకు నిప్పు పెడుతున్న రైతు

విత్తనాల కొనుగోళ్లలో అన్నదాతలు

జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో సాగు

నారాయణపేట, మే 29 : జిల్లా వ్యాప్తంగా రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు ముందుగానే వేసవి దుక్కులు దున్ని వ్యవసాయ భూములను సిద్ధం చేసుకొని విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, కంది విత్తనాలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వానాకాలంలో సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 1.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట, 1.69 లక్షల ఎకరాల్లో వరి, 55 వేల ఎకరాల్లో కంది, 11 వేల ఎకరాల్లో ఇతర పంటలు అవకాశముంది. అత్యధికంగా పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపడంతో యూరియా, కాంప్లెక్స్‌, పొటాష్‌ వంటి ఎరువులు దాదాపు 52,720 వేల మెట్రిక్‌ టన్నులు అవసరవుతోంది. యూరియా 18,150 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,190 వేల మెట్రిక్‌ టన్నులు, ఎంఏపీ 5,770 వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 16,150 వేల మెట్రిక్‌ టన్నులు, ఎస్‌పీటీ 1,050 మెట్రిక్‌ టన్నులు, సిటి కంపోస్ట్‌ 300 టన్నులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. విత్తనాల విషయానికి వస్తే వరి 42,250 వేల క్వింటాళ్లు, 2,200 క్వింటాళ్ల కందులు, 5,55,000 లక్షల పత్తి విత్తనాల పాకెట్లు, జొన్న 210 క్వింటాళ్లు, మొక్కజొన్న 96 క్వింటాళ్ల, వేరుశేనగ 120 క్వింటాళ్లు అవసరమవుతాయని వ్యయాసాయాధికారులు గుర్తించారు. ప్రస్తుతం రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చడంతో పత్తి విత్తనాలకు ఎనలేని డిమాండ్‌ నెలకొంది.

Updated Date - May 29 , 2024 | 10:54 PM