అవీనితికి పాల్పడిన వారికి శిక్ష తప్పదు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:09 PM
గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారందరికీ శిక్ష తప్పదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గెలుపొందడంతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట, జూన్, 12: గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారందరికీ శిక్ష తప్పదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గెలుపొందడంతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. త్వరలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, పేదలకు అండగా నిలుస్తామన్నారు. పెంచిన పింఛన్‌లు త్వరలోనే అందజేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో చేసిన అప్పులకు నెలకు రూ.60 వేల కోట్లు వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నామన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ మల్లురవి అన్నారు. అంతకు ముందు ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే తదితరులపై కాంగ్రెస్ నాయకులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు వారిని గజమాలతో సన్మానించారు. అనంతరం నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి, గౌరీశంకర్, రామనాథం తదితరులు పాల్గొన్నారు.