చేనేత కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 25 , 2024 | 10:59 PM
జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల సంక్షేమమే కా గ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డిలు అన్నారు.

నారాయణపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల సంక్షేమమే కా గ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డిలు అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్యెల్యే కాంపు కార్యాల యంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు చెక్కులను పంపిణీ చేసి ప్రసంగిం చారు. ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చొరవతో గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న చేయూత పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.ఎనిమిది కోట్ల నిధులు చేనేత కార్మికులకు మంజారు చేయించా మన్నారు. త్వరలో చేనేత కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లల్లో చేనేత కార్మికులకు ప్రాముఖ్యత కల్పిస్తా మన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, కౌన్సిలర్ సలీం, చేనేత జౌళిశాఖ ఏడీ బాబు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజు, మారుతీ, శంకర్, అంబు, చిట్టెం రాఘవేంద్రరెడ్డి ఉన్నారు.