Share News

వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:47 PM

మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ సర్వేను మిషన్‌ భగీరథ మొబైల్‌ యాప్‌లో వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

- ఇంటింటికీ నల్లా కనెక్షన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం

నారాయణపేట టౌన్‌, జూన్‌ 6 : మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ సర్వేను మిషన్‌ భగీరథ మొబైల్‌ యాప్‌లో వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హల్‌లో మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్‌ భగీరథ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఎన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్‌లు ఉన్నాయి? ఇంకా ఎన్ని కనెక్షన్‌లు ఇవ్వాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకునే వాళ్లకు ఇవ్వాల్సిన కనెక్షన్‌లు ఎన్ని ఉన్నాయనే వివరాలతో కూడిన పూర్తి సమాచారంపై జిల్లా వ్యాప్తంగా సర్వే చేపట్టాలని సూచించారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని సర్వేను పూర్తి చేయాలన్నారు. మిషన్‌ భగీరథ సర్వేకు నలుగురు మాస్టర్‌ ట్రైనర్లు అందుబాటులో ఉంటారని, మిషన్‌ భగీరథ ఇంజనీర్లు కూడా సర్వేలో అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిటట్టల్‌, డీపీవో సుధాకర్‌రెడ్డితో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:48 PM