Share News

సర్వే వంద శాతం పూర్తి చేయాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:17 PM

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేసి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశిం చారు.

సర్వే వంద శాతం పూర్తి చేయాలి
సర్వే సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

మరికల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేసి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశిం చారు. ఆదివారం మండలంలోని అప్పంపల్లి, పట్టణంలోని దత్తాత్రే య కాలనీలో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో ప ర్యవేక్షణ చేశారు. సర్వే సిబ్బందితో మాట్లాడు తూ.. సర్వే పకడ్బందీగా చేపడుతూ అర్హులకు ఇ ళ్లు మంజూరయ్యేలా చూడాలన్నారు. సర్వేలో అలసత్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో మొత్తం సర్వే ఎం త పూర్తయ్యిందని కలెక్టర్‌ ప్రశ్నించగా 61 శాతం నమోదైనట్లు ఎంపీడీవో కొండన్న సమాధానమి చ్చారు. సర్వేను రెండు రోజుల్లో వేగంగా చేప ట్టాలని కలెక్టర్‌ సిబ్బందికి సూచించారు. యా ప్‌లో ఏమైనా సమస్యలు వస్తున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో పూర్తి చేయాలి

మాగనూరు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని అధికా రులను ట్రైనీ కలెక్టర్‌ గరిమ నూరుల ఆదే శించారు. ఆదివారం మండలంలోని నేరడగంలో సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రహమతుద్దీన్‌, ఏపీవో కిశోర్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:17 PM