Share News

గొర్రెలు పంపిణీ చేయాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:53 PM

జిల్లా వ్యాప్తంగా గొర్రెల కోసం డీడీలు చెల్లించిన ప్రతీ ఒక్కరికీ గొర్రెలను పంపిణీ చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో గొర్రెల కాపరులు, నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

గొర్రెలు పంపిణీ చేయాలి
పేటలో ర్యాలీ నిర్వహిస్తున్న అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం నాయకులు

- అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 7 : జిల్లా వ్యాప్తంగా గొర్రెల కోసం డీడీలు చెల్లించిన ప్రతీ ఒక్కరికీ గొర్రెలను పంపిణీ చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో గొర్రెల కాపరులు, నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, భగవంతు మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొర్రెల పంపిణీని రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభించి, పూర్తి స్థాయిలో గొర్రెలను పంపిణీ చేయలేదన్నారు. ఈ పథకం మధ్య దళారులు, కమీషన్‌ ఏజెంట్ల పంట పండిందే తప్పా అసలైన లబ్ధిదారులకు గొర్రెలు అందలేదన్నారు. ఓట్ల కోసమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల క్రితం గొల్ల, కురుమలచే డీడీలు కట్టించుకొని గొర్రెలు అందించకుండా నిలువునా దోచుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,912 మంది గొల్ల, కురుమలకు గొర్రెలు అందాల్సి ఉందని, కేసీఆర్‌ ఎన్నికల అవకాశవాద విధానం వల్ల డీడీలు చెల్లించిన కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలను గుణపాఠంగా తీసుకొని ప్రజా సంక్షేమాన్ని అవలంభిస్తూ గొర్రెలు పంపిణీ చేయాలని కోరారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు తహసీల్దార్‌ ప్రతాప్‌సింగ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా, ఇప్ట్యూ నాయకులు కాశీనాథ్‌, నరసింహా, రాము, వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి, లింగప్ప, రాగప్ప, కతలప్ప, వెంకట్రాములు, ప్రశాంత్‌, భాస్కర్‌, అంజి, సాయి, రాములు, ప్రశాంత్‌, హాజీ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 10:53 PM