అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:59 PM
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీ రులకు పోలీస్ శాఖ రుణపడి ఉంటుందని జోగు లాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు.
పోలీస్ అమరులకు నివాళులర్పించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ
పరేడ్ మైదానం నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ
ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
మహబూబ్‌నగర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీ రులకు పోలీస్ శాఖ రుణపడి ఉంటుందని జోగు లాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. సంఘ విద్రోహులకు ఎదురొడ్డి పోరాడే క్రమంలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. వారి త్యా గాలు వెలకట్ట లేనివని, వారి స్ఫూర్తి నిత్యం మదిలో ఉంటుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయం పోలీసు పరేడ్ మైదానంలో సోమవారం స్మృతి పరేడ్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమానికి పోలీ స్ శాఖ కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అన్నిరకాల కృషి ఉంటుందని తెలిపారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలర్పించారని, అమరుల స్ఫూర్తితో వారి ఆశయసాధనకు కృషి చేస్తామన్నారు.
పుష్పగుచ్ఛాలతో నివాళి
అనంతరం పోలీసు కార్యాలయంలోని అమరు ల స్థూపం దగ్గర అధికారులు పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు. జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లాఎస్పీ జానకి, అడిషినల్ ఎస్పీ రాములు, ఏఆర్ అడిషినల్ ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, అమరులైన కానిస్టేబుళ్లు ప్రకాశ్, సుగుణాకర్ కుటుంబసభ్యులు జిల్లాలోని పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలతో నివాళి అర్పించారు. ఈ సమయంలో అమరుల కుటుం బ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అమరు ల కుటుంబసభ్యుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారు లకు సూచించారు.