వంట గ్యాస్ ధర తగ్గింపు హర్షణీయం
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:32 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంట గ్యాస్ ధరను రూ.100 తగ్గించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి
గద్వాల, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంట గ్యాస్ ధరను రూ.100 తగ్గించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గద్వాలలోని డీకే బంగ్లాలో శుక్రవారం పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వంట గ్యాస్ ధరను తగ్గించడంతో లక్షలాది కుటుంబాలపై ఆర్థిక బారం తగ్గుతుందన్నారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానానికి ప్రధానమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రామాంజనేయులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, కౌన్సిలర్ రజక జయశ్రీ, నాయకులు బల్గెర శివారెడ్డి, దాసు, శ్యామ్, డబ్బిలేటి నర్సింహులు, రఘుగౌడ్, ఢిల్లీవాలా కృష్ణ, సాయి, రాజేందర్ పాల్గొన్నారు.