Share News

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:04 PM

ఉపాధ్యాయులు ఎ దుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డిని కోరారు.

 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న తపస్‌ నాయకులు

- తపస్‌ ఆధ్వర్యంలో టీచర్‌ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డికి వినతి పత్రం అందజేత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 9 : ఉపాధ్యాయులు ఎ దుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీని కలిసి తపస్‌ నాయకులు ఉ పాధ్యాయ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్ర మోషన్ల విషయంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన వి ధంగా పదివేల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పోస్టుల్లో బీఈడీ చేసిన వారికి కూడా కల్పించి ప్రమోషన్లు కల్పిం చాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నా రు. పెండింగ్‌లో ఉన్న డీఏల ను ప్రకటించి పీఆర్సీని అమ లు చేయాలన్నారు. కేజీబీవీలో పని చేస్తున్న సిబ్బందికి మి నిమమ్‌ టైం స్కేల్‌ను ఇవ్వా లన్నారు. అదేవిధంగా చైల్డ్‌కేర్‌ సెలవులను ఇవ్వాలని, స్కా వెంజర్లను నియమించి పాఠ శాలల్లో మౌలిక వసతులను కల్పించాలని వారు కోరారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ అన్ని వి షయాలను ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంలో త మ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తపస్‌ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి శే ఖర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ స భ్యులు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ సురేఖ, అ కాడమిక్‌ కన్వీనర్‌ పెంట్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:04 PM