Share News

నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:04 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని క లిసి మెమోరాండం అందజేసినట్లు జిల్లా అధ్యక్షుడు నవీ న్‌ అన్నారు.

 నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న సంఘం సభ్యులు

- రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డికి వినతి పత్రం

- నాగర్‌కర్నూల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్‌

తాడూరు, ఆగస్టు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని క లిసి మెమోరాండం అందజేసినట్లు జిల్లా అధ్యక్షుడు నవీ న్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ గత పదేళ్లుగా నాయీబ్రాహ్మణులకు ఇలాంటి ప్రోత్సాహకరమైన సంక్షేమ పథకాలు అమలు కాకపోవ డం మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరి స్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలో ఉన్నందున సమస్యలను పరిష్కరించుకునే ది శగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలం గాణ రాష్ట్ర మంత్రులకు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్‌ మినీస్టర్ల క్వార్టర్స్‌లో రోడ్డు భవనాల మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి కార్పొరే షన్‌ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కో రినట్లు తెలిపారు. అదేవిధంగా మం త్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి గత కరీంనగర్‌ సభలో ఇచ్చిన మాట ప్రకా రం నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏ ర్పాటుకు త్వరితగతిన ఏర్పాటు చేయవల్సిందిగా మరొక సారి కలిసి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. అలాగే ప్రభు త్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డిని కూడా కలిసి కార్పొరేషన్‌ ఏర్పాటుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నాయీబ్రాహ్మణ సమైక్య సంక్షేమ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘం అధ్యక్షుడు గజ్జెలి వెంకన్న, రా ష్ట్ర సంఘం నాయకులు దేవరకొండ శ్రీనివాస్‌, వెంకట స్వామి, శ్రీహరి, శ్రీను, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు మంగలి నవీన్‌, అదేవిధంగా చింతచెట్టు శివ, కానుగుల రమేష్‌, మంగలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:05 PM