Share News

అడుగంటిన చెరువు.. కొంగల దండు

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:52 PM

కొంగలతో అది కొల్లేటి సరస్సును తలపిస్తోంది.. చెరువు నిండా కొంగలు వాలడం చూసేందుకు ముచ్చటగా ఉన్నది.. చెరువులో నీటికి బదులు నిండా వాలిన తెలుపు, నలుపు కొంగలే కనిపిస్తున్నాయి.

అడుగంటిన చెరువు.. కొంగల దండు
చెరువులో పురుగులు, చేపలను తింటున్న వివిధ రకాల పక్షులు

కొంగలతో అది కొల్లేటి సరస్సును తలపిస్తోంది.. చెరువు నిండా కొంగలు వాలడం చూసేందుకు ముచ్చటగా ఉన్నది.. చెరువులో నీటికి బదులు నిండా వాలిన తెలుపు, నలుపు కొంగలే కనిపిస్తున్నాయి. వేసవి కావడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర చెరువులో నీళ్లు అడుగంటాయి. దాంతో చేపలను వేటాడేందుకు వందల సంఖ్యలో కొంగలు చెరువుపై వాలాయి. చెరువు అడుగంటడంతో చేపల కోసం జపం చేయాల్సిన పని లేకుండా సులువుగా వాటిని పట్టి.. భుజిస్తున్నాయి. చెరువు మధ్యలో ఉన్న చిన్నపాటి బండపైన, దాని చుట్టూ వాలిన కొంగలను చూసేందుకు కనుల పండువలా ఉన్నది. ఈ దుశ్యాలను ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం క్లిక్‌మనిపించింది.

- ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు, మహబూబ్‌నగర్‌

Updated Date - Apr 17 , 2024 | 10:52 PM