Share News

ఓటమి భయంతోనే రిజర్వేషన్ల రాగం

ABN , Publish Date - May 21 , 2024 | 10:56 PM

ఓటమి భయంతోనే రిజర్వేషన్లను రద్దు చేయబోమంటూ బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ విమర్శించారు.

ఓటమి భయంతోనే రిజర్వేషన్ల రాగం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమణ

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ

గద్వాల టౌన్‌, మే 21 : ఓటమి భయంతోనే రిజర్వేషన్లను రద్దు చేయబోమంటూ బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభ్యున్నతికోసం ఏర్పాటైన మండల్‌ కమిటీ నివేదికను మొట్టమొదట వ్యతిరేకించినది బీజేపీనే అని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనను పూర్తి చేసి బీసీ జనాభాపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరా రు. పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అయిజ పెద్దవాగు బ్రిడ్జి నిర్మా ణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నియామకాల్లో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టా లన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీఎస్‌ ఆనకట్టను ఆధునికీకరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు పరంజ్యోతి, రేపల్లి దేవదాసు, రాజు, వీవీ నర్సింహ, ఉప్పేరు నర్సింహ, నర్మద, ఈదన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 10:56 PM