Share News

ఫ్యాషన్స్‌లో సరికొత్త ఒరవడి ‘కాసమ్‌’

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:08 PM

అన్ని వర్గాల వారికి కాలానుగుణమైన ఫ్యాషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘కాసమ్‌’ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ఒరవడి అని ప్రముఖ సినీ హీరోయిన్‌ మెహ్రీన్‌ ఫిర్జాదా అన్నారు.

ఫ్యాషన్స్‌లో సరికొత్త ఒరవడి ‘కాసమ్‌’
జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభిస్తున్న హీరోయిన్‌ మెహ్రీన్‌

- ప్రముఖ సినీ హీరోయిన్‌ మెహ్రీన్‌ ఫిర్జాదా

- గద్వాల పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన 11వ బ్రాంచ్‌

గద్వాల టౌన్‌, మార్చి 6 : అన్ని వర్గాల వారికి కాలానుగుణమైన ఫ్యాషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘కాసమ్‌’ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ఒరవడి అని ప్రముఖ సినీ హీరోయిన్‌ మెహ్రీన్‌ ఫిర్జాదా అన్నారు. వరంగల్‌లో 78 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ సంస్థ 11వ స్టోర్‌ను బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రారం భించింది. షోరూంను లాంచ్‌ చేసేందుకు హీరోయిన్‌ మెహ్రీన్‌ ఫిర్జాదా రావడంతో పట్టణంలో సందడి నెల కొన్నది. ముందుగా సంస్థ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వ లన చేసిన మెహ్రీన్‌ అనంతరం షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వస్ర్తాలు, డ్రస్సులు ఒకే షోరూంలో లభించే ఏర్పాటు చేసిన సంస్థకు అభినందనలు తెలిపారు. మెహ్రీన్‌ ఫిర్జాదా రాకతో పట్టణంలో సందడి నెలకొన్నది. ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రజలు కృష్ణవేణి చౌరస్తాకు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓపన్‌ టాప్‌ జీపులో అభిమానులకు అభివాదం చేస్తూ షోరూం వద్దకు చేరుకున్నారు. అనంతరం షోరూం అంతా కలియ తిరిగి వస్ర్తాలను పరిశీలించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కాసమ్‌ మల్లికార్జున్‌, కాసమ్‌ నమఃశివాయ, కాసమ్‌ కేధర్‌నాథ్‌, కాసమ్‌ శివప్రసాద్‌, కాసమ్‌ ప్రవీణ్‌, కాసమ్‌ సాయిగుప్తా, ప్రవీణ్‌, పుల్లూరు అరుణ్‌కుమార్‌, వరుణ్‌, విశాల్‌, అరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:08 PM