సీఎం ఇచ్చిన హమీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 10:55 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట బహిరంగ సభలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
- ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి
- ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్
నారాయణపేట, జూలై 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట బహిరంగ సభలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బారంబావి శివాలయంలో పూజలు నిర్వహించి, ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్‌లను పార్లమెంట్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం ముదిరాజ్‌లకు ఇచ్చిన హమీలను నెరవెర్చిలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్‌కు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. ముదిరాజ్‌ల నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్యెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో వెంకటేష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ చైర్మన్ కాంతు, ముదిరాజ్ సంఘం నాయకులు అప్పిరెడ్డిపల్లి రాము, కొనంగేరి హన్మంతు, గోవింద్ గేరి లక్ష్మికాంత్, ఓం ప్రకాష్, వెంకట్ రాములు, కాకర్ల బీమయ్య, సాయిలు, జనార్దన్, రాజేష్, రాజు, వినోద్, సునిల్, చక్రధర్, రవి పాల్గొన్నారు.