Share News

పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:03 PM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, చంద్రఘడ్‌ కోట పర్యాటక కేంద్రాలుగా అభి వృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పర్యాటక అభివృద్ధి చేసి చూపిస్తామని కల్లుగీత విభాగం రాష్ట్ర చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌ పేర్కొన్నారు.

పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
జూరాల ప్రాజెక్టుపై సీఎం, ఎమ్మెల్యే, మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

- కల్లుగీత విభాగం రాష్ట్ర చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌

అమరచింత, జూలై 31 : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, చంద్రఘడ్‌ కోట పర్యాటక కేంద్రాలుగా అభి వృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పర్యాటక అభివృద్ధి చేసి చూపిస్తామని కల్లుగీత విభాగం రాష్ట్ర చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో స్థానిక మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆన్‌ రికార్డుగా చంద్రఘడ్‌కోట, అలాగే జూరాల ప్రాజెక్టులను పర్యా టక అభివృద్ధిగా తీర్చిదిద్దాలని స్పీకర్‌ను కోరడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తు బుధవారం చంద్రఘడ్‌ కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రగడ్‌కోట, జూరాల ప్రాజెక్టుపై వేర్వేరుగా సీఎం, ఎమ్మెల్యే, మం త్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఆరు నెలల్లోనే ఈ ప్రాంత రహదారుల కోసం రెండున్నర కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, అ మరచింత మండల అధ్యక్షుడు కెజి.మహేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:03 PM