Share News

చారిత్రక ఆలయానికి పూర్వ వైభవం

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:36 PM

గద్వాల పట్టణంలోని భీంనగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కొత్త అందాలను సంతరించుకుంటున్నది.

చారిత్రక ఆలయానికి పూర్వ వైభవం
సంతాన వేణుగోపాల స్వామి ఆలయం, స్వామి వారి మూలవిరాట్‌

- సంతాన వేణుగోపాల స్వామి గుడి పునరుద్ధరణ

- ధర్మకర్తల పర్యవేక్షణలో పనులు

- నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు

గద్వాల టౌన్‌, జనవరి 1 : గద్వాల పట్టణంలోని భీంనగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కొత్త అందాలను సంతరించుకుంటున్నది. దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి 400 ఎకరాలకు పైగా మిరాసి భూమి ఉంది. గడచిన కొన్నేళ్లుగా నిరా దరణకు గురైన ఈ ఆలయ పూర్వ వైభవానికి వంశపారంపర్య ధర్మకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నా రు. ఇప్పటికే పనులు ప్రారంభమై కొనసాగుతుండగా, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొంత విరామం ఇచ్చారు.

క్షేత్ర విశిష్టత - ఆలయ నిర్మాణం

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన మహావిష్ణువు, సంతానం లేని వారికి వరములిచ్చే దేవుడిగా రుక్మిణీ సత్యభామ సమేతంగా గోమాత, దూడ, శంకుచక్రం సహితంగా వెలిశాడు. ఈ స్వామి ని కొలిస్తే శ్రీఘ్రంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. గద్వాల సంస్థాన వారసుల్లో ఒకరైన వెంకటాపురం కృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడైన భీం రెడ్డి, లక్ష్మీ నాంచారమ్మలకు వివాహమై ఏళ్లు గడుస్తు న్నా సంతానం కలుగలేదు. దీంతో వారు గద్వాల కోటలో వెలసిన భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలోని రామాలయ అర్చకుడు బోరవెల్లి రామ యణ కేశవాచార్యులను సంప్రదించారు. ఆయన వారికి సంతాన వేణుగోపాల స్వామి మూల మంత్రాన్ని ఉపదేశించారు. వారు 108 రోజుల పాటు మూల మంత్రాన్ని జపిస్తూ పూజలు చేశారు. ఆ తర్వాత వారి కి ఏడుగురు కుమారులు లక్ష్మారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, వెంకట్రామారెడ్డి, శేషిరెడ్డి, తిమ్మారెడ్డి, తిరమల్‌రావు, సర్వారెడ్డి జన్మించారు. ఆ సంతోషంతో వారి స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. పట్టణ పరిసరాల్లోని భీమ్‌నగర్‌లోని హయగ్రీవ స్వామి ఆలయం పక్కనే సంతాన వేణుగోపాల స్వామి ఆల యాన్ని నిర్మించారు. స్వామివారి మూలవిరాట్‌ను మహాబలిపురం నుంచి తెప్పించి ప్రాణప్రతిష్ఠ చేయిం చి, బోరవెల్లి రామాయణ కేశవాచార్యులను ప్రధాన అర్చకుడిగా నియమించారు. ఆయన వంశస్తులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

నేటి స్వామి వారి బ్రహ్మోత్సవాలు

సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల రెండవ తేదీ నుంచి ప్రారంభం కాను న్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండున ఉదయం పుణ్యా హవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, భేరీపూజ నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించ నున్నారు. మూడవ తేదీన ఉదయం నిత్య హోమం, రాత్రి స్వామివారి రథోత్సవం, ఊరేగింపు, నాలుగున పారువేట, తీర్థావలి, నాగవల్లి, పూర్ణా హుతి, దేవతా విసర్జన కార్యక్రమాలతో బ్రహ్మో త్సవాలు ముగియనున్నాయి.

భక్తుల సహకారంతో పూర్వ వైభవం

డాక్టర్‌ సుహాసిని రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త : మా పూర్వీకుల ఆశీస్సులు, వారసుల తోడ్పాటు, భక్తుల సహకారంతో ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నాము. రెండేళ్ల క్రితం నుంచి ఆల యానికి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు, అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాము. ఆలయ ప్రాంగణంలో స్వయంభువుగా వెలసిన హయగ్రీవ స్వామి విశిష్టత, సంతాన వేణుగోపాల స్వామి మహిమపై భక్తులకు అవగాహన కల్పించేలా తగిన కార్యాచరణ చేపట్టనున్నాం.

Updated Date - Jan 01 , 2024 | 11:36 PM