Share News

శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:18 PM

శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు పేట రూరల్‌ ఎస్‌ఐ కృష్ణదేవ్‌ పేర్కొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌
పేటలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు

నారాయణపేట మార్చి 18 : శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు పేట రూరల్‌ ఎస్‌ఐ కృష్ణదేవ్‌ పేర్కొన్నారు. పార్ల మెంట్‌ ఎన్నికల సందర్భంగా సోమవారం సాయంత్రం జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలచే ఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభ మైన ఫ్లాగ్‌ మార్చ్‌ ఆర్డీవో ఆఫీస్‌, సావర్కర్‌ చౌరస్తా, మెయిన్‌ చౌక్‌, పళ్ల క్రాస్‌రోడ్‌, హన్‌మాన్‌ టెంపుల్‌, ఎస్పీ వాడ, యాద్గిర్‌ రోడ్డు, సత్యనారాయణ చౌరస్తా, న్యూ బస్టాండ్‌, సీనియర్‌ సిటిజన్‌ పార్క్‌ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. యువత వాట్సాప్‌లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఐటీబీపీ డిప్యూటీ కమాండెంట్‌ రాజ్‌బీర్‌ సింగ్‌, డీఎస్పీ బోపాల్‌ సింగ్‌, డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్‌, ఆర్‌ఐ నరసింహా, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసులు, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:18 PM