Share News

పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్‌

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:59 PM

బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్‌ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత కొనియాడారు.

పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్‌
సర్వాయి పాపన్న గౌడ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, నాయకులు

- నివాళి అర్పించిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, ఏప్రిల్‌ 2 : బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్‌ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత కొనియాడారు. సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలను సాధించేందుకు, ప్రతీ ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు గౌడ్‌, ఆనంద్‌ గౌడ్‌, నరహరిగౌడ్‌, గోవింద్‌గౌడ్‌, కృష్ణయ్యగౌడ్‌, జనార్ధన్‌గౌడ్‌, కృష్ణ, ఎల్ల ప్ప, ఇసాక్‌, తమ్మల నర్సింహులు, భాస్కర్‌ యాదవ్‌, నాగ శంకర్‌, కోటేష్‌, లక్ష్మీనారాయణ గౌడ్‌, టీఎన్‌ఆర్‌ జగదీష్‌ పాల్గొన్నారు.

రాజ్యాంగ రక్షణ యాత్రకు స్వాగతం

గద్వాల టౌన్‌ : మహనీయుల మాసోత్సవంలో భాగంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర మంగళవారం గద్వాలకు చేరింది. యాత్రకు స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద జిల్లా నాయకులతో కలిసి జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత స్వాగతం పలికారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ మరోసారి అధికారాన్ని దక్కించుకో వాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని విద్యావంతులు, మేధా వులు నిశితంగా గమనించాలన్నారు. రాజ్యాంగ రక్షణ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవా లన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు రంగముని శ్రీధర్‌, గోవింద రాజులు, రజనీబాబు, న్యాయవాది మధు సూదన్‌బాబు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంక ట్రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎల్లప్ప, భాస్కర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పులిపాటి వెంకటేష్‌కు అభినందనలు

పద్మశాలి సేవా సంఘం తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ నాయకుడు పులిపాటి వెంకటేషను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అభినందించారు. మంగళ వారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కుల బాంధవుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్ర మంలో నాయకులు మధుసూదన్‌బాబు, శ్రీనివాస్‌ గౌడ్‌, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ నరహరి గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు ఎల్లప్ప, నాగేంద్రయాదవ్‌, తుమ్మల నరసింహులు, భాస్కర్‌యాదవ్‌, నాయకు లు జయకృష్ణ, దౌలన్న, నారాయణ, దేవరాజు, మోహన్‌యాదవ్‌, దిన్నె నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 10:59 PM