Share News

పోరాటయోధుడు పండుగ సాయన్న

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:33 PM

నిజాం రాజ్యంలో తిరుగుబాటు నాయకుడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

పోరాటయోధుడు పండుగ సాయన్న
పండుగ సాయన్న విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే, నాయకులు

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- జిల్లెడబండలో విగ్రహావిష్కరణ

గద్వాల, జూన్‌ 12: నిజాం రాజ్యంలో తిరుగుబాటు నాయకుడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జిల్లడబండ గ్రామంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పండుగ సాయన్న 1860 నుంచి 1900 వరకు తిరుబాటు నాయకుడిగా పేరొందాడని వివరించారు. ఆయన విగ్రహాం ఏర్పాటుతో భవిష్యత్‌ తరాలు ఆయన చరిత్రను తెలుసుకొనే అవకాశం ఏర్పడిందన్నారు. అందరు కలిసి మెలిసి ఉండాలని, గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు నాయకులను గ్రామస్థులు సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, సుభాన్‌, శ్రీధర్‌గౌడ్‌, పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి, రమేష్‌ నాయుడు, ప్రభాకర్‌రెడ్డి, రాజారెడ్డి, గోవిందు, రామడు, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎల్‌ఓసీ అందజేత

గద్వాల న్యూటౌన్‌ : గద్వాల పట్టణంలోని వేదనగర్‌కు చెందిన శ్రీనివాసులుకు మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి నుంచి లక్ష రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఎల్‌వోసీ, చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నరహరి శ్రీనివాసులు, మాజీ సర్పంచు ఈరన్నగౌడు, వేణు పాల్గొన్నారు.

మార్చెంట్‌ అసోసియేషన్‌కు శుభాకాంక్షలు

నూతనంగా ఏర్పాటైన గంజ్‌ మార్చెంట్‌ అసోయేషన్‌ అధ్యక్షుడు, కార్యవర్గసభ్యులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసిన వారిని ఆయన అభినందించారు. వారిలో అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌, జనరల్‌ సెక్రటరీ విజయ్‌మోహన్‌, జాయింట్‌ సెక్రటరీ సుదర్శన్‌, కోశాధికారి ఽధారనత్‌, నాయకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఉన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:33 PM