ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:56 PM
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి

- అదనపు కలెక్టర్ నగేష్
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై 8: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జడ్పీ సీఈవో యాదయ్యతో కలిసి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యా దులను పెండింగ్‌లో పెట్టకుండా వెనువెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఫిర్యాదులను పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పరిష్కారం కాని వాటికి ఉన్నతాధికారులకు లేదా సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.