Share News

సీఎం కప్‌ క్రీడలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Dec 05 , 2024 | 11:45 PM

సీఎం కప్‌ క్రీడా పోటీల ను విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

సీఎం కప్‌ క్రీడలను విజయవంతం చేయాలి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్‌ క్రీడా పోటీల ను విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. గురువారం సీఎం కప్‌ పోటీల సన్నద్ధతపై జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో జిల్లా అధికారులు, ఎంఈవోలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 7,8 తేదీల్లో గ్రామస్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో, 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయిలో పో టీల నిర్వహణ ఉంటుందన్నారు. జిల్లా స్థాయి విజేతలు ఈ నెల 27 నుంచి 21 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సీఎం కప్‌కి సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి 36 క్రీడా అంశాల్లో పోటీలు ఉంటాయని డీవైఎస్‌వో శ్రీనివాస్‌ తెలి పారు. స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, అడిషనల్‌ ఎస్‌.పి.రాము లు, డీఈవో ప్రవీణ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, డీవైఎస్‌వో శ్రీని వాస్‌, డీఐఈవో కౌసర్‌జహాన్‌, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్‌, డీపీవో పార్థసారథి, ఉమ్మడి జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌.పి.వెంకటేశ్‌, బాస్కెట్‌ బాల్‌ సంఘం అధ్యక్షుడు జాకీర్‌ అడ్వకేట్‌, పీడీలు దూమర్ల నిరంజన్‌, జగన్‌మో హన్‌గౌడ్‌, బాల్‌రాజ్‌, విలియం, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 11:45 PM