Share News

అధికారులు తీరు మార్చుకోవాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:14 PM

సమస్యలను పరిష్కరిం చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

అధికారులు తీరు మార్చుకోవాలి
సమస్యలపై అధికారులను నిలదిస్తున్న ఎంపీటీసీ సభ్యుడు రోషన్న

- ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు

- సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆగ్రహం

- సమస్యలను పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే విజయుడు

మానవపాడు, జనవరి 30 : సమస్యలను పరిష్కరిం చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ శాఖల అధి కారులు ఎజెండా అంశాలను వినిపించిన అనంతరం సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా అమరవాయి పాఠశాలలో ఏర్పాటు చేసి బాత్‌రూమ్‌ల డోర్లు విరిగి పోయాయని, వాటిని ఏర్పాటు చేయకుంటే చందాలు వేసుకొని ఎంపీటీసీ సభ్యుడు రోశన్న అన్నారు. ప్రభుత్వ బడుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా, రేకుల షెడ్లలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యార్థులను ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎంఈవో శివప్రసాద్‌ సమాధానమివ్వలేక నిళ్లు నమి లారు. ఎస్సీ కాలనీల్లో కరెంటు బిల్లులు ఎందుకు వసూ లు చేస్తున్నారని సర్పంచు ఆత్మలింగారెడ్డి ప్రశ్నించారు. ఎస్సీలు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, వంద యూనిట్లకు మించితే బిల్లు వస్తుందని ఏఈ సత్తార్‌బాషా వివరించారు. మిషన్‌ భగిరథ పైపులైన్లు లీక్‌ అవుతున్నాయని, ఏఈ రాఘవేంద్రకు చెప్పినా, పట్టించుకోవడం లేదని బోరవెల్లి సర్పంచు విజయ్‌ అన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజక్ట్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సమస్యలను పరిష్కరించ కుండా ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎంపీపీ అశోక్‌ రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అనంతరం మండలంలోని 16 గ్రామాల సర్పంచులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీడీవో రమణారావు, ఉపాధ్యక్షుడు సోమన్న గౌడ్‌, డీటీ ధరణి షా, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:14 PM