ప్రభుత్వ వైఖరి నశించాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:56 PM
అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్‌రామ్, జిల్లా అధ్యక్షురాలు రాజమణి డిమాండ్ చేశారు.

నారాయణపేట, జూలై 8 : అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్‌రామ్, జిల్లా అధ్యక్షురాలు రాజమణి డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట మునిసిపల్ పార్కు దగ్గర మూడవ రోజు అంగన్‌వాడీ రిలే దీక్షలు కొనసాగగా, వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తి అయిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్ఫర్లు దాదాపు పది వేల మంది ఉన్నారని, వారందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు నాల్గవ తేదీ వరకు 24 రోజుల పాటు ఉద్యోగులు నిరవదిక సమ్మె చేశారన్నారు. సమ్మె సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్ఫర్లకు రూ.లక్ష పెంచడంతో పాటు పింఛన్ వీఆర్‌ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. జూలై 1 నుంచి ఏకపక్షంగా అంగన్‌వాడీలను ఇంటికి పంపుతు నష్టం చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైంది కాదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పద్మమ్మ, తమ్మమ, మల్లమ్మ, సునీత, చంద్రకళ, జయంతి, కమల, అంజమ్మ, లక్ష్మమ్మ, బాలమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు.