హెడ్‌మాస్టర్‌పై మతోన్మాదుల దాడి గర్హనీయం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:47 PM
విద్యార్థిని మందలించాడన్న కారణంగా దళిత సామాజిక వర్గానికి చెందిన హెడ్‌మాస్టర్‌పై మ తోన్మాదులు జరిపిన దాడి గర్హనీయమని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ అ న్నారు.
గద్వాల టౌన్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థిని మందలించాడన్న కారణంగా దళిత సామాజిక వర్గానికి చెందిన హెడ్‌మాస్టర్‌పై మ తోన్మాదులు జరిపిన దాడి గర్హనీయమని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ అ న్నారు. ఇలాంటి ఆటవిక, మూకదాడులను సభ్యసమాజం, అన్నివర్గాల వారు ముక్త కంఠం తో ఖండించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఉప్పు గూడ హెడ్‌మాస్టర్‌పై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించా రు. ఈసందర్భంగా మాట్లాడిన నరసింహ, ని జంగా హెడ్‌మాస్టర్ తప్పుచేశాడని భావించిన వాళ్లు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, పోలీ సుల దృష్టికి తేవాలని, కేవలం దళితుడైన కార ణంగానే ఆయనపై దాడికి దిగడం దౌర్భాగ్యమ న్నారు. ఇదే విధమైన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని చోటుచేసుకుందని, బీజేపీ పాలనలో దళితులు మైనార్టీలపై మతోన్మాదుల దాడులు పెరిగాయనేందుకు ఈఘటనలే సాక్ష్యమన్నారు. బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపర మైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, అంజి, రఘు, మురళి, మాధ వి, ఆసియా, గోవిందు ఉన్నారు.