Share News

వైద్యం, విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:24 PM

రాష్ట్ర ప్రజలకు వైద్యం, విద్యను అందిచడమే ప్రభు త్వం లక్ష్యంగా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో మెగా సర్జికల్‌ క్యాంపును బుధవారం ప్రారంభించారు.

 వైద్యం, విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జూన్‌ 5: రాష్ట్ర ప్రజలకు వైద్యం, విద్యను అందిచడమే ప్రభు త్వం లక్ష్యంగా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో మెగా సర్జికల్‌ క్యాంపును బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్సల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి టెస్టులు నిర్వహించారు. డీసీహెచ్‌(జిల్లా కోఆర్డినేటర్‌ ఆసుపత్రి సర్వీసెస్‌) రమేష్‌ చంద్ర, డీఎంహెచ్‌అండ్‌వో సుధాకర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభు ఆధ్వర్యంలో వారితో కలిసి 43మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నల్లమల ప్రాంత ప్రజలు అన్ని విధాల ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమ న్నారు. మెగా సర్జికల్‌ క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల నియోజకవర్గంలో అన్ని రకాల వ్యాధులకు 1230 దరఖాస్తులు అందాయన్నారు. అందులో 400మేజర్‌ కే సులు గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. మొత్తం 13 మంది సెష్పలిస్టు డాక్టర్లచే ఆపరేషన్లు చేశామన్నారు. నేడు కూడా సర్జికల్‌ క్యాంపు కొనసాగుతుందన్నారు. జనరల్‌ సర్జన్లు రామచందర్‌, మహేష్‌, బాల్‌సిం గ్‌, వైద్య సిబ్బంది ఉదయ్‌, హరిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:24 PM