విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:29 PM
విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థు లంతా బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు.

- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
- జిల్లాలో ఘనంగా బడిబాట
- పునః ప్రారంభమైన పాఠశాలలు
- పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు
వనపర్తి రూరల్, జూన్ 12 : విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థు లంతా బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి హాజరయ్యారు. పాఠశాలల పునః ప్రారంభం సంద ర్భంగా సరస్వతీ పూజ నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థు లకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకో వడానికి ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పిస్తోం దని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పారు. అంతకుముందు కలెక్టర్, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకు న్నాయి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించారు. కార్యక్ర మంలో ఆర్డీవో పద్మావతి, మునిసిపల్ కమిషనర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మునిసిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, తహసీల్దార్, ప్రిన్సిపాల్ ఉమాదేవి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
· గోపాల్‌పేట : మండలంలోని తాడిపర్తి ప్రాథ మికోన్నత పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యల ను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, హెచ్‌ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నిధుల నుంచి 30 శాతం ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు చేస్తా
- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
అమరచింత : ఎమ్మెల్యే నిధుల నుంచి 30 శాతం ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు చేస్తానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధ వారం అమరచింతలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన జడ్పీహెచ్‌ఎస్ డీఎంఆర్, జడ్పీహెచ్‌ఎస్ బాలికల హైస్కూల్‌లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశా రు. అనంతరం ఆయా పాఠశాలల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేస్తున్నామని అన్నారు. నియోజకవర్గానికి పట్టు పట్టి రూ.16 కోట్లు తీసుకొచ్చి పాఠశాలలో మైనర్ రిపేర్‌లు, వైరింగ్, తాగునీరు, బాత్‌రూంలు తదితర మరమ్మతుల కోసం ఖర్చు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యా వలంటీర్ల అవసరంపై త్వరలో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ మంగమ్మ, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంఈవో భాస్కర్‌సింగ్, జడ్పీటీసీ సభ్యురాలు మార్క సరోజ, నాయకులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
కొత్తకోట : ప్రతీ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నామని దీనినే ప్రజాపాలన అంటారని గుర్తు చేశారు. పట్టణానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి(గొల్లబాబు) పాఠశాలలో ఫర్నిచర్ ఏర్పాటుకు రూ.10 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కురుమయ్య, ఉపాధ్యాయులు శ్రీశైలం, నాయకులు ప్రశాంత్, డాక్టర్ పీజే.బాబు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో టీచర్ పోస్టుల భర్తీ
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
గోపాల్‌పేట : త్వరలోనే 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని జయన్నతిరుమలపూర్, మున్ననూర్, తాడిపర్తి, గోపాల్‌పేట గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాట మాడి ఒక్క టీచర్ పోస్టయినా నియామకం చేపట్ట కుండా 20 వేల టీచర్ పోస్టులను ఖాళీగా పెట్టారని విమర్శించారు. త్వరలోనే డీఎస్సీ పరీక్ష నిర్వహించి 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. తిరుమలపూర్ పాఠశాలలో రెండు అదనపు తరగ తులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వి ద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఏకరూప దు స్తులను అందజేశారు. విద్యార్థులతో విద్యాభ్యాసం చే ుుంచారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం.నగేష్, అధికారులు, మల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్, శ్రీని వాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- ఆత్మకూరు : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందించే ఉపాధ్యాయులు ఉన్నారని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆత్మకూరు మునిసిపల్ చైర్‌పర్సన్ గాయత్రి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఒకటో వార్డులో బడి బాట కార్యక్రమానికి ఆమె హాజరై, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్ చెన్నయ్య, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.
- ఖిల్లాఘణపురం : మండలంలోని తిరుమలా యపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు ఎంపీడీవో వెంకటాచారి బుధవారం పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఎంఈవో ఉషారాణి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపీవో రాజు, ఏఈ సాయి రెడ్డి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- పెబ్బేరు : మునిసిపాలిటీ కేంద్రంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాల, సెంచువాడ పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు మునిసిపల్ చైర్‌పర్సన్ కరు ణశ్రీ పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఆయా పాఠశాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయ కులు విడివిడిగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంఈవో జయరాములు, మునిసి పల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, కమిషనర్ ఆదిశేషు, స్పెషల్ ఆఫీసర్ సురేష్, కౌన్సిలర్ సుమతి తది తరులు పాల్గొన్నారు.