Share News

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:56 PM

రైతు బంధును నూ టికి నూరుశాతం అమలు చేసి తీ రుతామని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
ఊట్కూర్‌లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఊట్కూర్‌లో మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం

ఊట్కూర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతు బంధును నూ టికి నూరుశాతం అమలు చేసి తీ రుతామని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని తహసీల్‌ వద్ద ఐకే పీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మ హిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు ఆర్థిక శక్తి గా ఎదగాలన్న లక్ష్యంతోనే మహిళల శక్తి క్యాంటీ న్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాను న్న రోజుల్లో ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికి మహిళల పేరిట రూ.ఐదు లక్షలు ఇళ్లు కట్టుకోవడానికి మంజూరు చేయిస్తామని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మొగలప్ప, తహసీల్దార్‌ రవి, ఎంపీ డీవో ధనుంజయ్‌గౌడ్‌, ఐకేపీ ఏపీఎం నిర్మల, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వై.నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ సూర్యప్రకాష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యజ్ఞే శ్వర్‌రెడ్డి, నాయకులు, మహిళా సమాఖ్య సిబ్బం ది పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:56 PM