పేదల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:45 PM
MP Mallu Ravi said that the Congress government is working towards the upliftment of the poor.
- సమీక్ష సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి
నాగర్‌కర్నూల్/గద్వాల న్యూటౌన్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ నెల 22న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాల పై అవగాహన సదస్సు, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎంఎస్‌ఎంఈ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు సీతారామా రావు, దేవ సహాయం, గద్వాల అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల అధికారులు, బ్యాంక్ అధికారులతో ఈనెల 22వ తేదీన నాగర్‌కర్నూల్ పట్టణంలో చేపట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షే మ పథకాల అవగాహన సదస్సుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అందిస్తున్న అనేక రకాల పథకాలను ప్రజలకు నిరుద్యోగ యువతీ యువకులకు చేరువ చేసే దిశగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయా లని అధికారులకు తెలియజేశారు. ఈ నెల 22న నాగర్‌కర్నూల్ పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎంఎస్‌ఎం, వివిధ బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రభు త్వాలు అందించే పలు పథకాలకు సంబంధించిన రుణాల మంజూరు, ప్ర భుత్వం అందిస్తున్న సబ్సిడీలు లాంటి విషయాలను వివరిస్తారని తెలియ జేశారు. ప్రతీ వ్యక్తికి రుణాలు అందించే విధంగా బ్యాంకర్లు సిద్ధంగా ఉండా లని కోరారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల ఆర్థిక అభ్యున్నతికీ బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో విద్యా వైద్యానికి ఖర్చు చేసి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించనున్నట్లు ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరగనున్న అవగాహన సదస్సుకు ప్రజలు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొ రేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ అధికారి శ్రీనివాస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అవార్డు ఎన్‌జీవో అధ్యక్షుడు వెంకట్, నాగర్‌కర్నూల్ డీఆర్‌డీఏ చిన్న ఓబులేష్, డీఈవో గోవిందరాజులు, బీసీ వెల్ఫేర్ అధికారి నజీమ్‌ఆలీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాంలాల్, డీఆర్‌డీవో ఉమాదేవి, ఎల్‌డీఎం శ్రీనివాసులు, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ కాన్పిడరేషన్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కో ఆర్డినేటర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రైజెస్ ప్రెసిడెంట్ నల్లబాబు, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆర్‌సీవోలు పాల్గొన్నారు.