Share News

రైతును రాజుగా చేయాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:57 PM

ఆ ధునిక వ్యవసాయ పద్ధతులతో రైతును రాజు ను చేసి దేశ చరిత్రలోనే రైతులు గొప్పస్థాయికి ఎదిగే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.

రైతును రాజుగా చేయాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యం
రైతు పండుగ స్టాళ్లను రైతుతో ప్రారంభింపచేస్తున్న మంత్రులు రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- రైతు పండుగ వేడుకలను ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

భూత్పూర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆ ధునిక వ్యవసాయ పద్ధతులతో రైతును రాజు ను చేసి దేశ చరిత్రలోనే రైతులు గొప్పస్థాయికి ఎదిగే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం మహ బూబ్‌నగర్‌ జిల్లా, భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ గ్రామ శివారులో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు పం డుగ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూప ల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే లు యన్నెం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీ కృష్ణ, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఈర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్సీ కూచకూళ్ల దామోదర్‌రెడ్డి, రైతు కమి షన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తదితరులు హాజర య్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మె ల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత రైతులను పట్టించు కున్న నాఽథుడే కరువయ్యారని, కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ. 18 వేల కోట్లతో రైతు రుణ మాఫీ చేసిందన్నారు. అదే విధంగా రూ.50వేల కోట్లు రైతుల సంక్షేమ కోసం ని ధులు ఖర్చు చేసిందన్నా రు. ఈ కార్యక్రమానికి హా జరైన మహబూబ్‌నగర్‌ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రె డ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న రైతు పండు గను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిం చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు అ ప్పులు బాధలతో రైతులు అష్ట-కష్టాల పాలై అవస్థలు పడ్డారని అన్నారు. రైతులకు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి రుణమా ఫీ చేశారన్నారు. అంతకు ముందు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లా డుతూ... ఇందిరాగాంధీ కాలం నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ముఖ్యంగా జూరాల, కోయిల్‌సాగర్‌, నాగార్జునసాగర్‌ శ్రీశై లం డ్యాంలను కట్టి రైతులకు సాగు నీటిని అందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే ద క్కిందన్నారు. 16టీఎంసీలు ఉన్న జూరాల 6-7 టీఎంసీ లకు చేరిందని.. పూడికతో నిండిపోయిందని, పూడిక తీయడానికి పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం పూడిక తీయడా నికి కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించా రు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు త దితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:57 PM