Share News

కొల్లాపూర్‌ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:34 PM

కొల్లాపూర్‌ పట్టణ సుందరీక రణకు చర్యలు చేపట్టాలని తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని మునిసిపల్‌ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

 కొల్లాపూర్‌ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి
కొల్లాపూర్‌లో బండాయిగుట్ట ఆలయం వద్ద నిలిచిన టీటీడీ కల్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

- తాగునీటి సమస్య తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకోవాలి

- మునిసిపల్‌ అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, మార్చి 16 : కొల్లాపూర్‌ పట్టణ సుందరీక రణకు చర్యలు చేపట్టాలని తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని మునిసిపల్‌ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం ఉదయం కొల్లాపూర్‌ పట్టణంలో మార్నింగ్‌వాక్‌లో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్‌, ప ర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం చుట్టూ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల కోసం మునిసిపల్‌ అధికా రులతో కలిసి స్థల పరిశీలన చేశారు. పట్టణంలోని 20వ వార్డులో తిరుగుతూ కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో ఎలాంటి చెత్తచెదారాలు ఉండకుండా ఎక్కడా మట్టి కుప్పలు కన్పించకుండా మొత్తం సీసీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మునిసిపల్‌ అధికారులను జూపల్లి ఆదేశించారు. మిషన్‌ భగీ రథ పైపులైన్‌ నిర్మాణం లో ధ్వంసమైన సీసీ రోడ్ల నిర్మాణానికి వెంటనే ప్రతి పాదనలు రూపొందించా లని, సత్వరమే పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. కొల్లాపూర్‌ పట్టణంలోని బండాయ గుట్ట వేంకటేశ్వర ఆల యంలో నిలిచిన టీటీడీ కల్యాణ మండపం నిర్మా ణ పనులను మంత్రి పరి శీలించారు. ఆగిపోయిన కల్యాణ మండపం నిర్మా ణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన గు త్తేదారులను ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలో ప్ర ధాన రోడ్డుకిరువైపులా వేయాల్సిన ఫుట్‌పాత్‌ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. టీయూఎఫ్‌ఐ డీసీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ కింద కేటాయించిన నిధుల తో గుర్తించిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిం చాలని, మిగతా అభివృద్ధి పనులకు తాను నిధులు మం జూరు చేయిస్తానని మంత్రి పేర్కొన్నారు. 20వ వార్డులో కాంగ్రెస్‌ నాయకులు కాటమోని రమేష్‌గౌడ్‌ కుమార్తె ఇ టీవలే మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట మునిసిపల్‌ కౌ న్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:34 PM