మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:36 PM
కోస్గి మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యు లు ప్రమాణ స్వీకారం చేశారు.
కోస్గి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కోస్గి మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యు లు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మా ర్కెట్ యార్డు ఆవరణలో నూతన కమిటీతో జిల్లా మార్కెటింగ్ సెక్రటరీ బాలమణి ప్రమాణ స్వీకా రం చేయించారు. మొదట చైర్మన్‌గా భీములు ప్రమాణం చేయగా, తరువాత వైస్ చైర్మన్‌గా గిరి ప్రసాద్‌రెడ్డి, తరువాత డైరెక్టర్లు ప్రమాణం చేశా రు. అనంతరం నూతన చైర్మన్ మాట్లాడుతూ కోస్గి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని, అం దుకు నాయకులు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు మంజూరు చేస్తారని, నూతన పాలక సభ్యులంతా అందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, నాయకులు పాల్గొన్నారు.