విషయ పరిజ్ఞానం అవసరం
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:51 PM
విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

- కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, మార్చి 6 : విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్‌కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రాష్ట్రపతిగా, ప్రధానిగా, కేంద్ర మంత్రులుగా, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష హోదాలో పలు అంశాలు, సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి, మాట్లాడారు. లెజిస్టేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యూడీషియల్ వ్యవస్థల గురించి వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఓట్ల ద్వారా ఎన్నుకో బడతారని వాళ్లు అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను పీఎం, సీఎం, అధికారులు అమలు చేస్తారన్నారు. ఆయా నిర్ణయాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా? లేదా? అని జ్యూడిషియల్ వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. ఏదైజూ అంశంపై డిబెట్ చేయాలనుకుంటే ముందుగా ఆ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆ డిబేట్ కొనసాగుతుంద న్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంగారెడ్డి, డీవైఎస్‌వో వెంకటేష్, నెహూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి కోటా నాయక్, సిబ్బంది నారాయణగౌడ్, శంకర్, శ్రీనివాసులు, షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.