Share News

క్రీడల్లో విద్యార్థులు రాణించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:18 PM

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాల ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

క్రీడల్లో విద్యార్థులు రాణించాలి
సీఎం కప్‌ జెర్సీలను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాల ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని నివాసంఓ సీఎంకప్‌ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన 240మంది విద్యార్థులకు సొం త ఖర్చులతో జెర్సీలను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే సమాజంలో సముచితమైన గౌర వం ఉంటుందన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పేరు ప్రతిష్ట లు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బాలకృ ష్ణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి వెంక టేష్‌శెట్టి, లక్ష్మారెడ్డి, రవీందర్‌, రవి పాల్గొన్నారు.

జనవరి 1న అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించే మహాపూజ ఆహ్వాన పత్రికను ఆది వారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్వగృహంలో అ య్యప్ప భక్తులు అశోక్‌గౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, శివరా ములు అందించారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, కావలి ఆంజనేయులు, నాగరాజు, రమేష్‌ పాల్గొన్నారు.

మఠం జాతర పోస్టర్‌ విడుదల

మాగనూరు: మండలంలోని నేరడంలోని సిద్ద లింగేశ్వర పక్షమాద్రి మఠంలో మార్చి 16, 17, 18 తేదీలలో నిర్వహించే జాతర మహోత్సవ పోస్టర్‌ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదివారం విడుదల చేశారు. మాజీ సర్పంచ్‌ రాజప్పగౌడ్‌, ఆనంద్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:18 PM