Share News

విద్యార్థులకు వేడి భోజనం పెట్టాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:37 PM

మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఆ శాఖ ఏఎస్‌ డబ్ల్యూవో కన్యాకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు వేడి భోజనం  పెట్టాలి
హాస్టల్‌లో విద్యార్థులకు నోట్‌ బుక్కులను అందిస్తున్న ఏఎస్‌డబ్ల్యూవో

- ఏఎస్‌డబ్ల్యూవో కన్యాకుమారి

- ఎస్సీ బాలుర హాస్టల్‌ తనిఖీ

ఊట్కూర్‌, జూలై 5 : మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఆ శాఖ ఏఎస్‌ డబ్ల్యూవో కన్యాకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్టల్‌ లో నిల్వ ఉంచిన బియ్యం, ఇతరత్రా సామగ్రిని పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రతను పరి శీలించారు. చేసిన వంట గురించి వర్కర్లతో మాట్లాడారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, విద్యార్థుల సంఖ్యను వార్డెన్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో సమావేశమై భోజనం, ఇతరత్రా వసతుల గురించి అడిగి తెలుకున్నారు. వార్డెన్‌ జగదీష్‌రెడ్డితో మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో హాస్టల్‌లోకి ఎలాంటి విషసర్పాలు రాకుం డా జాగత్రలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన వేడి భోజనం పెట్టాలన్నారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చివరగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:37 PM